Type Here to Get Search Results !

Ticker

E-NEWSPAPERS         MAGAZINES          KNOW YOUR PAY         INCOME TAX           NEWSPAPERS         EMPLOYMENT NEWS

How to check balance in Sukanya Samriddhi Scheme?

 




 

 

 

 

 

 




How to check balance in Sukanya Samriddhi Scheme? సుకన్య సమృద్ధి 

 స్కీమ్‌లో బ్యాలెన్స్ ను ఇలా చెక్ చేసుకోండి

How to check balance in Sukanya Samriddhi Scheme?

సుకన్య సమృద్ధి స్కీమ్‌లో బ్యాలెన్స్ ను ఎలా చెక్ చేసుకోవాలంటే?



బెస్ట్ పొదుపు పథకాలను పోస్టాఫీసు అందిస్తూ వస్తుంది..ప్రతి వయస్సు వారికి ఈ పథకాలు అందుబాటులో ఉన్నాయి..పుట్టిన బిడ్డ నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరు ఈ పథకాలను వినియోగించుకోవచ్చు..ఇప్పటికే ఎన్నో పథకాలు మంచి ఆదరణ పొందాయి.అయితే ఇన్వెస్ట్ చేసిన డబ్బులను ఎలా చెక్ చేసుకొవాలి అనే విషయం చాలామందికి తెలియదు..వాటి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

బ్యాంకుకు వెళ్లకుండానే యాప్ లు లేదా, టోల్ ఫ్రీ నెంబర్లు, మెసెజ్ ల ద్వారా బ్యాలెన్స్ తో పాటు మరికొన్ని బ్యాంకింగ్ సేవలను పొందే సౌలభ్యం అందుబాటులోకి వచ్చింది. అయితే ఇవి బ్యాంకు ఖాతాదారుల సేవల వరకే పరిమితం. అయితే పోస్టాఫీసు, బ్యాంకుల్లో చాలా మంది సేవింగ్ స్కీమ్స్ లో పొదుపు చేసుకుంటారు. మరి మన సేవింగ్స్ స్కీమ్స్ లో ఎంత మొత్తం ఉందో తెలుసుకోవాలంటే పాస్ బుక్ ప్రింట్ వేయించుకోవడం లేదా పోస్టాఫీసు లేదా బ్యాంకుకు వెళ్లి తెలుసుకోవల్సి వచ్చేది.


అయితే పోస్టాఫీసులు సైతం ఇ-పాస్‌బుక్ ఫీచర్‌ను ప్రవేశపెట్టడంతో పోస్ట్ ఆఫీస్ స్మాల్ సేవింగ్స్ కస్టమర్‌లు తమ ఖాతా సమాచారాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఏ ప్రదేశం నుండి అయినా, నెట్ బ్యాంకింగ్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాక్సెస్ అవసరం లేకుండా తెలుసుకోవచ్చు. జాతీయ పొదుపు పథకాల ఖాతాదారులకు సరళీకృతమైన, మెరుగైన డిజిటల్ సౌకర్యాలను అందించడానికి ఈఏడాది అక్టోబర్ 12వ తేదీ నుంచి ఈ-పాస్‌బుక్ సదుపాయాన్ని ప్రవేశపెట్టారు.ఫోన్ ద్వారా ఈ వివరాలను తెలుసుకోవచ్చు..


పొదుపు ఖాతాలు (పీఓఎస్ ఎ), సుకన్య సమృద్ధిఖాతాలు, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలు ( పిపిఎఫ్ ) కోసం మినీ స్టేట్‌మెంట్‌లు మొదట అందుబాటులో ఉంచుతారు..పిపిఎఫ్, సేవింగ్ ఖాతా, సుకన్య సమృద్ధి ఖాతా బ్యాలెన్స్‌ను తనిఖీ చేసే విధానం

www.indiapost.gov.in 

 లేదా 

 www.ippbonline.com

 లో అందించబడిన

ఇ-పాస్‌బుక్ లింక్‌పై క్లిక్ చేయండి.లేదా నేరుగా ఇక్కడ క్లిక్ చేస్తే డైరెక్ట్ గా అఫిషియల్ పేజీ ఓనెన్ అవుతుంది.ఆ తరువాత మొబైల్ నంబర్‌ని నమోదు చేయాలి. అక్కడ ఉన్న కోడ్‌ను ఎంటర్ చేసి ఓటీపీని ఎంటర్ చేస్తే చాలు బ్యాలెన్స్ వివరాలు వెంటనే వస్తాయి..