*꧁꧂𒈞 ★𒈞꧁꧂*
*⛪గృహరుణం... తొందరగా తీర్చేద్దాం*
*❍గృహరుణం.. సొంతింటి కలను నిజం చేసుకునేందుకు ఇది ఒక అవసరం. కానీ, వాస్తవంలో ఒక దీర్ఘకాలిక భారం. తక్కువ వడ్డీ ఉన్నప్పుడు కాస్త ఇబ్బంది ఉండదు కానీ, 8 శాతానికి మించి వడ్డీ రేట్లు ఉన్న ప్రస్తుత తరుణంలో వడ్డీ బరువు మోయాల్సిందే. చాలామంది పదవీ విరమణ చేసిన తర్వాతా గృహరుణానికి వాయిదాలు చెల్లించాల్సిన పరిస్థితిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇంటి రుణాన్ని వేగంగా తీర్చేయడానికి ఏం జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం.*
*➣మీ గృహరుణం తీసుకున్న బ్యాంకు దగ్గరకు ఒకసారి వెళ్లండి. మీరు తీసుకున్న రుణం, వర్తిస్తున్న వడ్డీ.. ఇంకా ఎన్నాళ్లు చెల్లించాలి అనే వివరాలు తెలుసుకోండి. ఇప్పుడు బ్యాంకులు, గృహరుణ సంస్థలు ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా మొబైల్ యాప్‌లోనే రుణానికి సంబంధించిన వివరాలన్నీ అందిస్తున్నాయి. వీటిని పరిశీలించండి. అప్పుడే మీరు తీసుకున్న రుణంపై మీకు ఒక స్పష్టత వస్తుంది. ఆ తర్వాతే ఏం చేయాలన్నది నిర్ణయించుకోవడం సులభం అవుతుంది. దీర్ఘకాలిక రుణాలను తీసుకున్నప్పుడు అనేక ఆర్థిక లక్ష్యాలు వెనక్కి వెళ్లిపోతాయి. వీటిని సాధించేందుకు రాజీ పడాల్సిన అవసరం ఏర్పడుతుంది. కాబట్టి, ఈ రుణాన్ని తొందరగా తీర్చే ప్రయత్నం చేయాలి.*
*➣మీ రుణాన్ని వేగంగా చెల్లించాలంటే ఆర్థిక పరిస్థితి అందుకు సహకరించాలి. మీ ఆదాయం, ఖర్చులు, బాధ్యతలు, పెట్టుబడులు, రుణ వాయిదాలు పోను మిగులు మొత్తం కనిపిస్తే.. దాన్ని రుణం తీర్చేందుకు వినియోగించవచ్చు.*
*➣వృథా ఖర్చులను సాధ్యమైనంత మేరకు తగ్గించుకోవాలి. అప్పుడే మిగులు మొత్తం పెరుగుతుందన్న సంగతిని గుర్తించాలి. ఇలా మిగులు మొత్తంతో ఏడాదికోసారి రుణం అసలును చెల్లించే ప్రయత్నం చేయాలి.*
*➣ఏడాదికి 12 నెలలు వాయిదాలు చెల్లించాలి. కానీ, రుణం తొందరగా తీర్చాలంటే.. మీరు ఏడాదికి 14 నెలలు ఉన్నాయనుకోవాలి. అప్పుడే వడ్డీ భారం తగ్గి, రుణం తొందరగా తీరుతుంది. ఇతర లక్ష్యాల కోసం మీరు పెట్టుబడి పెట్టేందుకు వీలవుతుంది. బాకీ ఉన్న రుణ మొత్తంలో ఏటా 5-7 శాతం చెల్లిస్తే రుణ వ్యవధి గణనీయంగా తగ్గుతుంది. ఏడాదికి ఒక ఈఎంఐ అదనంగా చెల్లించినా.. మూడేళ్ల ముందే అప్పు తీరుతుంది.*
*➣మీ బ్యాంకులో వసూలు చేస్తున్న వడ్డీ.. మిగతా బ్యాంకుల్లో ఉన్న వడ్డీని పోల్చి చూడండి. 0.5 శాతం వరకూ వ్యత్యాసం ఉంటే.. పెద్దగా ఇబ్బంది లేదు. కానీ, 1 శాతం వరకూ అధికంగా ఉందంటే మాత్రం ఆలోచించాల్సిందే. బ్యాంకు లేదా రుణ సంస్థను మార్చుకునే ప్రయత్నం చేయండి. మీ క్రెడిట్ స్కోరు, ఆదాయం తదితరాలను బట్టి, రీఫైనాన్సింగ్ చేసే విషయాన్ని బ్యాంకులు పరిశీలిస్తాయి. ఈఎంఐ తగ్గితే, ఇతర పెట్టుబడులు పెట్టేందుకు ప్రయత్నించాలి. ముందుగా వర్తించే ఫీజుల గురించి తెలుసుకోండి.*
*➣మీకు అనేక రుణాలు ఉంటే.. వాటిని నిర్వహించడం కష్టం కావచ్చు. సాధ్యమైనంత మేరకు రుణాలను ఏకీకృతం చేసేందుకు ప్రయత్నించండి. వడ్డీ అధికంగా ఉన్న వ్యక్తిగత, క్రెడిట్ కార్డు రుణాలను తీర్చేందుకు ప్రయత్నించండి.*
*➣కొంతమంది అధిక వడ్డీకి రుణాలు తీసుకొని, తమ వద్ద ఉన్న డబ్బును తక్కువ వడ్డీ వచ్చే డిపాజిట్లలో జమ చేస్తుంటారు. ఇది మంచిది కాదు. అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకొని, మిగతా మొత్తాన్ని రుణాన్ని చెల్లించేందుకు వాడుకోవచ్చు.*

Social Plugin