వరలక్ష్మి వ్రత కల్పం👈
వరలక్ష్మీ వ్రతాన్ని జరుపుకునే వారు కొన్ని పనులు తప్పకుండా చేయాలి.. పొరపాటున కూడా ఈ పనులు చేయకూడదు.. ఈ సందర్భంగా వరలక్ష్మీ వ్రతం రోజున ఏమి చేయాలి.. ఏమి చేయకూడదనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..శ్రావణమాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం అమ్మవారిని వరలక్ష్మి రూపంలో కొలుచుకుంటాం. అనివార్య కారణాలతో ఈ రోజున కుదరకపోతే మాసంలోని ఇతర శుక్రవారాలలో ఈ వ్రతాన్ని ఆచరించవచ్చని పండితులు చెబుతున్నారు. వరలక్ష్మీ వ్రతం అంటే లక్ష్మీదేవికి పూజ చేయడం. శ్రావణమాసంలో ముత్తయిదువులు ఈ వ్రతాన్ని చేసుకుంటారు. శ్రావణ మాసంలోని శుక్ల పక్షం చివరి శుక్రవారం నాడు ఎక్కువ మంది వరలక్ష్మీ వ్రతం చేసుకుంటారు.శ్రావణమాసం శుక్లపక్షం చివరి శుక్రవారం అమ్మవారికి పూజ చేసి వ్రతం నోచుకుంటే కోరిన కోర్కెలు తీర్చి..వరాలు ప్రసాధిస్తుందని భక్తులు విశ్వసిస్తుంటారు. ఈ నెలలో ఈ వ్రతం చేయడం వల్ల ఆస్తి, ఐశ్వర్యం కలుగుతుందంటారు.

Social Plugin