📱🖥️ *ప్రభుత్వ ఉంద్యోగుల PRC పై ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం*👇👇 📱
🖥️ *అన్ని ప్రధాన దినపత్రికలు ఓకే చోట*👇👇
https://drive.google.com/file/d/1uWSdRoD2_YR6rRegq13s74j1Twq-LzP7/view?usp=sharing
[07/11, 5:51 am] Jkrao: *ప్రభుత్వ ఉంద్యోగుల PRC పై ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం*
◆ PRC నివేదిక విడుదలకు అంగీకరించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు
◆ సోమవారం సాయంత్రం PRC నివేదికను విడుదల చేయనున్న శశిభూషన్ కుమార్ (Pre. Secretary General Admission Dept.)
◆ PRC నివేదిక ప్రతులను 13 ఉద్యోగ సంఘాలకు అందజేయనున్నట్లు తెలిపిన ప్రభుత్వం
◆ నివేదికలోని అంశాలపై ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపనున్న ఏపీ ప్రభుత్వం
◆ *ఈనెల 17వ తేదీ నుంచి జరిగే అసెంబ్లీ శీతాకాల సమావేశాలలో PRC పై ప్రకటన చేయనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు.*
[07/11, 6:00 am] Jkrao: *మహా పాదయాత్ర నిర్వాహకులకు నోటీసులు ఇచ్చిన ప్రకాశం జిల్లా పోలీసులు*
🎈🌾NAGAYADAV APTF🌾🎈
అమరావతి ఒక్కటే రాజధాని అనే నినాదంతో ఉద్యమిస్తున్న రైతులు మహా పాదయాత్ర చేపట్డడం తెలిసిందే. కాగా, పాదయాత్ర నిర్వాహకులకు ప్రకాశం జిల్లా పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఎక్కువ శబ్దం వచ్చే మైకులు వాడారని, కరోనా నేపథ్యంలో మాస్కులు లేకుండా యాత్రలో పాల్గొన్నారని నోటీసుల్లో పేర్కొన్నారు. అనుమతించిన సంఖ్య కంటే ఎక్కువమంది పాదయాత్రలో పాల్గొంటున్నారని ఆరోపించారు.
కాగా, పోలీసుల నోటీసులపై మహా పాదయాత్ర నిర్వాహకులు స్పందించారు. వారంలోగా నోటీసులపై వివరణ ఇస్తామని వెల్లడించారు. నేడు పాదయాత్ర గుంటూరు జిల్లా పెదనందిపాడు నుంచి ప్రకాశం జిల్లా పర్చూరు చేరుకుంది. రేపు రాత్రికి రైతులు ఇంకొల్లు చేరుకుంటారు. సోమవారం పాదయాత్రకు విరామం అని నిర్వాహకులు ప్రకటించారు.
[07/11, 6:00 am] Jkrao: *ఈ నెల 19న ఈ శతాబ్దంలోనే అత్యంత సుదీర్ఘమైన చంద్రగ్రహణం*
🎈🌾NAGAYADAV APTF🌾🎈
ఈ నెల 19న ఈ శతాబ్దంలోనే అత్యంత సుదీర్ఘమైన చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఇది పాక్షిక చంద్రగ్రహణమే అయినా ఏకంగా 3 గంటల 28 నిమిషాల పాటు కనువిందు చేయనుంది. ఇది భారత్ లోనూ కనిపిస్తుంది. అయితే ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, అసోం తదితర ప్రాంతాల్లో చూడొచ్చు.
ఈ పాక్షిక చంద్రగ్రహణాన్ని ఉత్తర అమెరికా ఖండంలోని 50 దేశాల వారు పూర్తిగా వీక్షించవచ్చు. అంతేకాదు, దక్షిణ అమెరికా ఖండంలోని మెక్సికోలోనూ ఇది దర్శనమిస్తుంది. దీన్ని ఫ్రాస్ట్ మూన్ (మంచుతో కప్పబడిన చంద్రుడు) అని పిలుస్తారని నాసా వర్గాలు వెల్లడించాయి. కాగా ఈ ఏడాదికి ఇదే చివరి చంద్రగ్రహణం.
[07/11, 6:00 am] Jkrao: *పెట్రో ధరలపై ప్రజలకు మేలు చేసే నిర్ణయం తీసుకుంటాం: ధర్మాన కృష్ణదాస్*
🎈🌾NAGAYADAV APTF🌾🎈
ఇతర రాష్ట్రాల్లో పెట్రో ధరలు తగ్గిస్తుండడంతో ఏపీలోనూ తగ్గించాలంటూ విపక్షాలు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాయి. దీనిపై ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ స్పందించారు. పెట్రో ధరలపై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ప్రజలకు మేలు చేకూర్చేలా మంచి నిర్ణయం తీసుకుంటామని అన్నారు.
పెట్రో ధరలపై కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడం హర్షణీయమని పేర్కొన్నారు. దేశంలో ఇప్పటికే బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో చమురుపై పన్నులు తగ్గించడంతో ఇతర రాష్ట్రాలపై ఒత్తిడి పెరుగుతోంది. పెట్రో ధరలపై ఏపీ, తెలంగాణ తమ నిర్ణయం ప్రకటించాల్సి ఉంది.
[07/11, 6:00 am] Jkrao: *ఏప్రిల్‌నుంచి డీఆర్‌డీఏ పథకం రద్దు రాష్ట్రాలకు కేంద్రం లేఖ*
🎈🌾NAGAYADAV APTF🌾🎈
ఈనాడు, అమరావతి: జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఏ) పథకాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి నిలిపివేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి సంజయ్ కుమార్ లేఖ రాశారు. డీఆర్‌డీఏను జిల్లా పరిషత్తు లేదా జిల్లా పంచాయతీల్లో విలీనం చేయాలని సూచించారు. జిల్లా పరిషత్తులు లేని ఈశాన్య రాష్ట్రాల్లో జిల్లా కౌన్సిల్, ఇతర సంస్థల్లో విలీనం చేయాలని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలని పేర్కొన్నారు. డీఆర్‌డీఏలో డిప్యూటేషన్‌పై పని చేస్తున్న సిబ్బందిని మాతృశాఖకు పంపించాలని, మిగతా సిబ్బందిని జిల్లా ప్రణాళిక, పర్యవేక్షణ విభాగం లేదా ఉపాధి హామీ పథకం, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, జాతీయ సామాజిక సహాయ కార్యక్రమంలో సర్దుబాటు చేయాలని సూచించారు.
Social Plugin